హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): గ్రాట్యుటీ ఉద్యోగి హకు అని, అదేమీ మేనేజ్మెంట్ ఇచ్చేది కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పెంచిన సీలింగ్ ప్రకారం ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులంటూ పీఎఫ్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)వేసిన అప్పీళ్లపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల తీర్పు చెప్పారు.
వందల సంఖ్యలో ఉద్యోగులు 2007 నుంచి 2010 మధ్య రిటైర్ అయ్యారు. వాళ్లకు గ్రాట్యుటీ సీలింగ్ పరిమితి రూ.3.5 లక్షలు కాకుండా రూ.10 లక్షలు చెల్లించాలని పీఎఫ్ అప్పిలేట్ అథారిటీ తీర్పు చెప్పింది. ఈ వాదనలను ఉద్యోగుల తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వ్యతిరేకించారు. వాదనల అనంతరం హైకోర్టు.. పీఎఫ్ అప్పిలేట్ అథారిటీ తీర్పు ప్రకారమే గ్రాట్యుటీ చెల్లించాలని ఇప్పటికే చెల్లించిన మొత్తం మినహా మిగిలిన నగదును వడ్డీతో చెల్లించాలని తీర్పు వెలువరించింది.