హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు మంజూరయ్యాయి. గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జీ రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.