హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కొత్తగా మంజూరుచేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పోస్టుల మంజూరు విషయంలో రాష్ట్ర క్యాబినెట్ మొండి చెయ్యి చూపించిందని గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు లేకుండా కొత్తగా ఏర్పాటు చేసిన 18 కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రకటనలో ప్రశ్నించారు.
311 కొత్త పోస్టులకు ప్రతిపాదనలు పంపించగా, 157 పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని, కానీ క్యాబినెట్ తిరస్కరించిందని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని, 311 పోస్టులను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మొత్తం 311 పోస్టులను మంజూరుచేయాలని లేఖలో కోరారు.