హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, తన సతీమణి సుధాదేవ్వర్మ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడులను నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, గవర్నర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) కెనడా ఆధ్వర్యంలో తంగేడు సాంస్కృతిక సంస్థ బతుకమ్మ వేడుకలు నిర్వహించింది. కెనడాలో పుట్టిన పిల్లలకు తెలంగాణ సంస్కృతి ప్రాధాన్యత తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది బతుకమ్మ, బోనాలు, ఇతర పండుగలను నిర్వహిస్తున్నట్టు టీడీఎఫ్ తెలిపింది. కార్యక్రమంలో టీడీఎఫ్ బోర్డు ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ ధర్మపురి, వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆధ్వర్యంలో 800 మంది ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను జరుపుకొన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్‌గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణరావు, ట్రెజరర్ సందీప్‌కుమార్, జాయింట్ ట్రెజరర్ సుందర్‌రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్, వైస్ ప్రెసిడెంట్ శివతేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరిప్రసాద్, రాములు, రమేశ్, మహేశ్, శ్రీహరి, జీవన్‌రెడ్డి, వినోద్, రఘుపాల్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.