భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): చెత్త బండి అమ్మా.. మీ బజార్‌కు వచ్చిందమ్మా… ఇలాంటి పిలుపు అక్కడ వినబడడం లేదు.. కొత్తగూడెం (Kothagudem) జిల్లా కేంద్రంలో ఆరు గ్రామ పంచాయతీలకు చెందిన కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి సమ్మె చేస్తుండటంతో పంచాయతీల్లో చెత్త పేరుకు పోయింది. దీంతో ఇండ్లలో చెత్త కుప్పలు కంపువాసన కొడుతున్నాయి.
కాగా, తొమ్మిది రోజులుగా కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలకు బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, ఆదివాసీ సంఘాలు కార్మికులు మద్దతు తెలిపాయి. జిల్లా కేంద్రంలో ఉన్న తమకు వేతనం పెంచాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.