హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ): తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పోరుబాట పట్టారు. శుక్ర, శనివారాల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ సమ్మె చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ తదితర కార్మిక సంఘా లు జేఏసీగా ఏర్పడి ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్ల ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. డీపీవో, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం దిగిరాకుంటే జనవరి 4 తర్వాత ఏరోజైనా నిరవధిక సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. శనివారం సమ్మె సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. మల్టీపర్పస్ పని విధానానికి సంబంధించిన జీవో-51 రద్దుచేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.