హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ఇప్పటి వరకు 4,598 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, ప్రభుత్వం నిర్ణయించిన 7,572 కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
‘సీతారామ’కు భూసేకరణ పూర్తిచేయాలి
సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని, భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే బృందాలను నియమించాలని సంబంధిత అధికారులను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శనివారం జలసౌధలో సాగునీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించా రు. ఎత్తిపోతల పథకం పనుల కోసం ఇప్పటి వరకు 6,234.91ఎకరాలు సేకరించగా, ఇం కా 993 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో నీటిపారుదలశాఖ ము ఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎ న్సీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.