Graduate MLC Elections | నల్లగొండ : నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 43 మంది సభ్యుల ఎలిమినేషన్ పూర్తి అయింది. ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 896 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 598 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి 399 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్‌కు 218 ఓట్లు వచ్చాయి.
మొత్తంగా పరిశీలిస్తే..
కాంగ్రెస్ – 1,23,709 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 1,04,846 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 43,712 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 29,915
కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ – 18,863