కోరుట్ల, ఫిబ్రవరి 22: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయన కారును జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలోని పూల్వాగు బ్రిడ్జిపై లారీ ఢీకొన్నది.
ప్రమాదంలో శేఖర్‌రావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రాథమిక చికిత్స తీసుకున్న శేఖర్‌రావు మరో కారులో కరీంనగర్ వెళ్లారు. లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు. లారీ డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కోరుట్ల ట్రస్మా ప్రతినిధులు శేఖర్‌రావును పరామర్శించి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.