శంకరపట్నం, ఆగస్ట్ 20 : ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటూ ఓ గ్రామ పాలనాధికారి (జీపీవో) ఏసీబీకి పట్టుబడ్డాడు. డీఎస్పీ మహేందర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్కు చెందిన బాధితుడు తన తండ్రి పేరిట మొలంగూర్ శివారులో ఉన్న భూమిని తన తల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు జూలై 21న స్లాట్ బుక్ చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి జీపీవో కాంపేటి శ్రీనివాస్ రూ.20వేల లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి జీపీవో తహసీల్దార్ కార్యాలయంలో రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.