హైదారాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సహకార వ్యవస్థలో వేతనాల పెరుగుదలకు రంగం సిద్ధమైంది. స్కాబ్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ నివేదికను సీఎం కేసీఆర్ ఆమోదించడంతో సహకార శాఖ పీఏసీఎస్ చైర్మన్ల గౌరవ వేతనాలను పెంచాలని నిర్ణయించింది. మంగళవారం వ్యవసాయ, సహకార శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ సంగతి వెల్లడించారు. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న సంఘాల చైర్మన్లకు రూ.7,500, రూ.5-10 కోట్ల టర్నోవర్ ఉన్న సంఘాల చైర్మన్లకు రూ.10 వేలు, రూ.10-15 కోట్ల టర్నోవర్ ఉన్న సహకార సంఘాల చైర్మన్లకు రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది.