న్యూఢిల్లీ : ప్రైవేట్ వాహనదారులకు ఊరట కలిగించేందుకు, టోల్ వసూలును సరళీకరించేందుకు కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించేవారి కోసం వార్షిక, జీవిత కాల టోల్ పాసులను ప్రవేశపెట్టడం ద్వారా అవరోధాలు లేని ప్రయాణాన్ని వారికి అందించాలని యోచిస్తున్నది. సంవత్సరానికి రూ.3 వేలు చెల్లిస్తే వార్షిక టోల్ పాస్, రూ.30 వేలు చెల్లిస్తే 15 ఏండ్ల జీవిత కాల పాస్ అందించాలని ఆలోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.