Subsidy Gas | సబ్సిడీ గ్యాస్ సగం మందికే.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొంటేనే
Subsidy Gas | మహాలక్ష్మి పథకంలో భాగంగా తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500లకే వంటగ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తీరా అమలు సమయంలో అనేక షరతులు విధిస్తున్నది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు మూడు ప్రధాన షరతులు విధించింది.
- దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి
- తెల్ల రేషన్‌కార్డు కలిగినవారికే పథకం వర్తింపు
- మూడేండ్ల సగటు ఆధారంగా సిలిండర్ల కేటాయింపు
- బుకింగ్ సమయంలో మొత్తం బిల్లు చెల్లించాల్సిందే
- ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ జమ
- మహాలక్ష్మి పథకం విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకంలో భాగంగా తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500లకే వంటగ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తీరా అమలు సమయంలో అనేక షరతులు విధిస్తున్నది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు మూడు ప్రధాన షరతులు విధించింది. ఈ మేరకు పథకం అమలు విధి విధానాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల్లోనూ పలు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొన్నది.
40 లక్షల మందికే సబ్సిడీ గ్యాస్
రూ.500లకే గ్యాస్ పథకాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం 40 లక్షల మంది వినియోగదారులకే అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రులు మాత్రం తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ సంఖ్యను 40 లక్షలకే పరిమితం చేయడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులున్నాయి. 1.24 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్‌కార్డుతోపాటు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారి వివరాలను ఇటీవల పౌరసరఫరాల సంస్థ లెక్కతీసింది. ఈ రెండు ఉన్నవారు సుమారు 65 లక్షల మంది ఉంటారని అంచనా వేసింది. ప్రభుత్వం 40 లక్షల మందికి మాత్రమే సబ్సిడీ గ్యాస్ ఇచ్చి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన 25 లక్షల మంది పరిస్థితి ఏంటనేదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ 40 లక్షల మంది అర్హులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేసింది? 25 లక్షల మందిని ఎందుకు ఎంపిక చేయలేదనేదానిపైనా స్పష్టత కరువైంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ మాత్రం ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హుల జాబితాలో పేరులేనివారు ఎమ్మార్వో వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మొత్తం డబ్బులు చెల్లించాల్సిందే
సబ్సిడీ గ్యాస్ పథకంలో భాగంగా గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులు ముందుగా మొత్తం డబ్బును కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే.. అవి వినియోగదారులకు డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాయి. అంటే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులు రూ.955 చెల్లించాల్సిందే. ఆ తర్వాత సబ్సిడీ రూ.455 వినియోగదారుల ఖాతాలో జమవుతాయి. అయితే ఈ సబ్సిడీ డబ్బు ఎప్పుడు జమవుతుందనేదానిపై కూడా స్పష్టత లేదు.
ప్రభుత్వం విధించిన షరతులు
సబ్సిడీ గ్యాస్ పొందాలంటే సదరు లబ్ధిదారు ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో సబ్సిడీ గ్యాస్ పథకానికి కచ్చితంగా దరఖాస్తు చేసుకొని ఉండాలి.
దరఖాస్తుదారులకు కచ్చితంగా తెల్ల రేషన్‌కార్డు ఉండాలి.
దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
ఈ పథకంలో ఇచ్చే సిలిండర్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. గత మూడేండ్లుగా సదరు వ్యక్తి వినియోగించిన (బుక్ చేసిన) గ్యాస్ సిలిండర్ల సంఖ్య సగటును లెక్కించి దాని ఆధారంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తారు.
ప్రజల సందేహాలు
- గ్యాస్ కనెక్షన్ కేవలం మహిళల పేరుపై ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందా? లేక మగవాళ్ల పేర్లపై ఉన్నా వర్తిస్తుందా?
- సొంత గ్రామాల్లో ప్రజా పాలన దరఖాస్తు చేసినవారికి హైదరాబాద్‌లో గ్యాస్ కనెక్షన్ ఉంటే వారికి ఈ పథకం వర్తిస్తుందా? వర్తించదా?
- సబ్సిడీ సిలిండర్ల కేటాయింపునకు మూడేండ్ల వినియోగ సగటును పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికి ఈ పథకం వర్తిస్తుందా? లేదా?
- తెల్ల రేషన్‌కార్డు ఉన్నప్పటికీ ప్రజాపాలనలో దరఖాస్తు చేయకపోతే ఈ పథకం వర్తించదా?
- ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న రూ.40 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కలుపుతుందా? లేదా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

