న్యూఢిల్లీ: విధి నిర్వహణ సమయంలో సఫాయి కర్మచారులు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు 30 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు స్పష్టంచేసింది. శాశ్వత అంగవైకల్యం పొందినవారికి కనీసం రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని తెలిపింది. ఇతర అంగవైకల్యానికి రూ.10 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని చెప్పింది.
మాన్యువల్ స్కావెంజింగ్ను పూర్తిగా అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేశవ్యాప్తంగా మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ అనేక మంది సఫాయి కర్మచారులు ప్రాణాలు కోల్పోయారని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.