భయపడితే జ్వరం వస్తుందా?
మా బాబు వయసు పదమూడు సంవత్సరాలు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. జ్వరం బాగా వస్తున్నదని ఇంటికి పంపించారు. జ్వరానికి సాధారణంగా ఇచ్చే సిరప్ వాడితే తగ్గలేదని చెప్పారు. ఇంటికి వచ్చాక బాబు ఇంకా బలహీనమయ్యాడు.
మా బాబు వయసు పదమూడు సంవత్సరాలు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. జ్వరం బాగా వస్తున్నదని ఇంటికి పంపించారు. జ్వరానికి సాధారణంగా ఇచ్చే సిరప్ వాడితే తగ్గలేదని చెప్పారు. ఇంటికి వచ్చాక బాబు ఇంకా బలహీనమయ్యాడు. ‘స్కూల్లో ఏమన్నా ఇబ్బంది ఉందా’ అని అడిగితే.. ‘బాగా
చదవట్లేదని సార్ చాలా కోపడ్డాడు’ అని చెప్పాడు. ఆ భయం వల్ల జ్వరం వస్తుందేమోనని మా అనుమానం. పిల్లల డాక్టర్కి చూపించాము. పరీక్షలు చేయించారు. ఆ రిపోర్టులు ఇంకా రాలేదు. ఏదైనా విషయం వల్ల భయం ఏర్పడితే జ్వరం వస్తుందా? మా బాబుకి జ్వరం తగ్గడానికి సలహా ఇవ్వండి.
జ్వరం సాధారణంగా ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. వైరల్ ఫీవర్ వల్ల జలుబు, జ్వరం వస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవుల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో శరీరం అతిగా స్పందించడం వల్ల కూడా జ్వరం వస్తుంది. కానీ, అది ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం అంత సాధారణంగా రాదు. మీరు జ్వరమని చెప్పారు. కొంచెం నీరసంగా ఉన్నాడని చెప్పారు.
మిగతా లక్షణాలు చెప్పలేదు. మీ బాబుకు జలుబు, దగ్గు ఉందా? గ్రంథులు వాచాయా? శరీరంపై దద్దుర్లు వచ్చాయా? ఆకలి ఎలా ఉంది? ఈ లక్షణాలన్నీ చూసి ఫలానా ఇన్ఫెక్షన్ అనుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాం. దానికి అనుగుణంగా చికిత్స అందిస్తాం. మీ బాబుకు మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేయించాలి. ఒళ్లు వెచ్చగా ఉండటం వేరు. జ్వరం ఉండటం వేరు. శరీర ఉష్ణోగ్రత 97.5 నుంచి 99.5 ఫారన్ హీట్ డిగ్రీలు ఉంటే సాధారణ శరీర ఉష్ణోగ్రతలు గానే పరిగణించాలి. అంతకంటే ఎక్కువ ఉంటే, క్రమం తప్పకుండా జ్వరం వస్తుంటే తప్పకుండా పరీక్షలు చేయించాలి. భయపడినంత మాత్రాన జ్వరం రాదు.
కాకపోతే, మీ బాబు మానసికంగా ఇబ్బందిపడి ఉంటాడు. స్కూల్లో పరిస్థితిని బట్టి, దాని కారణంగా మానసికంగా కుంగిపోయి ఉంటే.. అదే సమయంలో ఇన్ఫెక్షన్ వస్తే తట్టుకునే శక్తి తగ్గుతుంది. ఏదో ఒక జబ్బు ఉందనుకుంటారు. మీ అబ్బాయికి భయం వల్లనే జ్వరం వచ్చిందనుకోవడానికి లేదు. వెంటనే పరీక్షలు చేయించండి. త్వరగా వైద్య చికిత్స అందించండి. సాధారణంగా అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి. కంగారుపడకండి.
-డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

