హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాలకు ఆర్టీ సీ అద్దె బస్సులను కేటాయిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. తొలి విడత 150 మ హిళా సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. త్వరలో మిగిలిన సంఘాలకు రెండో విడత 450 అద్దె బస్సులు కేటాయించనున్నట్టు తెలిపింది. బస్సుల కొనుగోలుకు సర్కార్ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనున్నది.
బస్సు కొనుగోలుకు అయ్యే నిధులను ఈఎంఐ రూపంలో ఏడేండ్లపాటు ఆర్టీసీనే చెల్లించనుంది. బస్సు డ్రైవర్, కండక్టర్, డీజిల్, నిర్వహణను ఆర్టీసీనే చూసుకుంటుంది. ప్రతి నెల మండల మహిళా సమాఖ్యకు చెల్లించే బస్సు అద్దె 77,220లో నుంచి 8,857 ఈఎంఐగా ఆర్టీసీ చెల్లించనుంది.