హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాం తి పర్వదినాల సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పాడిపంటలు, సుఖశాంతులతో ప్రజలు తులతూగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాంక్షించారు. పండుగలు మన వారసత్వ ప్రతీకలని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత విలువ ఇచ్చే రాష్ట్ర ప్రజలు నిత్యం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన అభిలషించారు.
సిరిసంపదలతో తులతూగాలి: ఎంపీ వద్దిరాజు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి సంబురాలను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు.