హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : భారతీయ సంసృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం ఉన్నదని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని గుర్తుచేశారు. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్లో బిగ్క్యాట్స్ సంరక్షణపై అంతర్జాతీయ వర్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా శివ్‌ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణలో భారత్ ముందుందని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వం అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నదని తెలిపారు.
పీసీసీఎఫ్-హెచ్ ఓఎఫ్ఎఫ్ డాక్టర్ సీ సువర్ణ మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా రెండు పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. 9నెలల వయసు కలిగిన ‘ఇషాన్’ అనే మగపులి పిల్లతోపాటు ‘వన్యా’ అనే ఆడ పులి పిల్లను దత్తత తీసుకున్నారు. దీంతో గవర్నర్‌కు జూ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ వినయ్‌కుమార్, జూపార్క్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సునీల్ హిరేమత్, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ స్నేహజ, పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహారీ, అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఎం భగవత్, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.