హుజూరాబాద్‌టౌన్/నీలగిరి, సెప్టెంబర్ 26: రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్ కోటా కింద సిఫారసు చేసిన కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై తక్షణమే ఆమోదించాలని తెలంగాణ ఎరుకుల సంఘం (కుర్రు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, ఉపాధ్యక్షుడు కోనేటి రాజు డిమాండ్ చేశారు.
మంగళవారం నల్లగొండ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వారు వేర్వేరుగా మాట్లాడుతూ.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ చేస్తున్న సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే గవర్నర్ సాకులు చూపుతూ అభ్యర్థిత్వా న్ని తిరస్కరించడం సరికాదని పేర్కొన్నారు.