ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ బ్రేకులా?
ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలను సీఎం కేసీఆర్ గుర్తించి, వా రిని ప్రభుత్వంలో విలీనం చేసేందు కు ప్రయత్నిస్తుంటే గవర్నర్ అడ్డుకోవాలని చూడటం సరికాదని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు.
- బీజేపీ కార్యకర్తగా చేస్తారా?
- ఎంపీ మాలోత్ కవిత
మహబూబాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలను సీఎం కేసీఆర్ గుర్తించి, వా రిని ప్రభుత్వంలో విలీనం చేసేందు కు ప్రయత్నిస్తుంటే గవర్నర్ అడ్డుకోవాలని చూడటం సరికాదని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి బీజేపీ కార్యకర్తగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆమె పే ర్కొన్నారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించే ప్రతి బిల్లును ఏదో వంకతో తిరస్కరించడం, వెనక్కి పంపడమే పనిగా పెట్టుకోవడం సరికాదని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును అడ్డుకునే ప్రయత్నాలను గవర్నర్ తమిళిసై మానుకొని, వెంటనే ఆమోదం తెలుపాలని విజ్ఞప్తి చేశారు. దేశమే నివ్వెరపోయే విధంగా మణిపూర్‌లో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

