హైదరాబాద్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు.
అంతకుముందు యాదాద్రి నుంచి వచ్చిన ఇద్దరు వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను అందజేవారు. ఆలయ ఈవో గీత మంత్రికి పుష్పగుచ్చం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.