హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన గవర్న ర్, సీఎంను మర్యాదపూర్వకంగా క లుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అ నుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆయన ప్రశంసించినట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని సం సరణలు, ప్రణాళికలతో ముందుకువెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేజ్ విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవను ముఖ్యమంత్రికి వివరించా రు. బీయూడీఎస్ యాక్ట్‌ను నోటిఫై చేయాలని ము ఖ్యమంత్రిని కోరారు. విద్యుత్తు రంగంలో సంసరణలు, మూడో డిసం ఏర్పాటు అంశాలను ఆర్బీఐ గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై బీజేపీ అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం గాంధీభవన్‌కు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో గాంధీభవన్ ప్రధాన ద్వారం వద్ద ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునేందుకు కర్రలతో నిలబడటంతో బీజేపీ కార్యాలయం మెట్రోస్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.