హైదరాబాద్, జనవరి 5, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సిఫారసులకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ నిరాకరిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సీజే అలోక్ అరాధే, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఎమ్మెల్సీలను నామినేట్ చేసే అధికారం మంత్రివర్గానికి మాత్రమే ఉంటుందని, దీన్ని అడ్డుకునే హకు, అధికారం గవర్నర్‌కు లేదని ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిటిషన్లకు విచారణ అర్హత ఉన్నదో లేదో తేలుస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం.. విచారణను 24కు వాయిదా వేసింది.