హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలకు సంబంధించిన అత్యాధునిక విధానాలపై హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్‌షాప్ ప్రారంభమైం ది. ‘హైదరాబాద్ ఆర్థోస్కోపీ కాంక్లేవ్-2025’ పేరుతో సికింద్రాబాద్‌లోని యశోద దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ప్రారంభించారు.
రోబోటిక్ శిక్షణ, లైవ్ సర్జరీలు, వీడియో బోధనలో ఆర్థోపెడిక్ వైద్యు లు, అధ్యాపకులు తమ నైపుణ్యాన్ని పెంపొ ందించుకునేందుకు ఈ సదస్సు సరైన వేదిక అని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ఆర్థోస్కోపీ శస్త్రచికిత్సలో సాధించిన పురోగతి, అత్యాధునిక విధానాలపై దృష్టి సారించనున్నట్టు చెప్పారు.
రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సు, లైవ్ వర్క్‌షాప్‌లో దేశం నలుమూలల నుంచి 600 మందికిపైగా ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొంటున్నట్టు సికింద్రాబాద్ యశోద దవాఖాన సీనియర్ స్పోర్ట్ ఆర్థోపెడిక్, ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి తెలిపారు.