హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కమిటీని ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బీ విద్యాసాగర్‌రావు, డీ వాసుదేవరావు, గౌరవాధ్యక్షుడిగా బీ నర్సింగరావు, ట్రెజరర్‌గా ఎస్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్‌గా జయాకర్, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణారెడ్డి, మహిళా సెక్రటరీగా మేరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తెలిపారు.