హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీల మీదకాదు.. రైతుల ఆత్మహత్యలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత తుంగబాలు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధిచెప్తారని అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి స్ఫూర్తితో తిట్ల దండకం ఎంచుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై విమర్శలు మాని, నిరుద్యోగులకిచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేయా లని కోరారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలను పక్కనబెట్టి.. ప్రజలకు మేలుచేసే పనులపై దృష్టిపెట్టాలని తుంగ బాలు హితవు పలికారు.