హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 3: అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న టీఆర్ఎస్కు ఓటేద్దామని, సంక్షోభం సృష్టించే బీజేపీని తరిమేద్దామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం హుజూరాబాద్ పట్టణంలోని ప్రజలతో కలిసి బోర్నపల్లి 14వ వార్డు, ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఈటల పూర్తి నిర్లక్ష్యంతో టౌన్‌లోని 350 రోడ్లలో కనీసం మూడు రోడ్లను కూడా సరిగా వేయలేదని విమర్శించారు. స్థానికులు చెప్పులరిగేలా ఈటల చుట్టూ తిరిగి దరఖాస్తులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట తరహా ఇకడ సైతం అభివృద్ధిని చేసేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.50 కోట్లతో రోడ్ల పనులు కొనసాగుతున్నాయని, వాటికి అదనంగా రూ.1.70 కోట్లతో రెండు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని చెప్పారు.