హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటింటికీ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు, రైతు బీమా, చేనేత బీమా, ఆసరా పింఛన్ అందిస్తున్న ఘనతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్త పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, నళిని కిరణ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.