సర్పంచ్ల వేతనాలు విడుదల.. ఐదు నెలల గౌరవ వేతనాలకు గ్రీన్ సిగ్నల్
సర్పంచ్‌లకు 5 నెలలుగా నిలిచిపోయిన వేతనాల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు ఎదురొంటున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించి ఈ నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామాలు ఉండగా, 12,702 గ్రామాల్లో కొత్తగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి.
- నేడో, రేపో ఖాతాల్లో జమకానున్న నిధులు
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సర్పంచ్‌లకు 5 నెలలుగా నిలిచిపోయిన వేతనాల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు ఎదురొంటున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించి ఈ నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామాలు ఉండగా, 12,702 గ్రామాల్లో కొత్తగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. నిరుడు డిసెంబర్ 22న సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.6,500 గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉన్నది. కానీ, బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మే వరకు ఐదు నెలలుగా ఒక్కొక్కరికి రూ.32,500 ప్రభుత్వం బకాయి పడింది. మొత్తం రూ.41.28 కోట్లు రావాల్సి ఉన్నది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేతనాలు అందక సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని ‘నమస్తే తెలంగాణ’ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వార్తపై ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్‌శాఖ స్పందించింది. సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించి, బడ్జెట్‌ను విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో సర్పంచ్ల ఖాతాల్లో నిధులు నేరుగా జమకానున్నట్టు అధికారులు తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిధుల విడుదలకు సహకరించిన ‘నమస్తే తెలంగాణ’కు సర్పంచ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

