హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు కారణంగా వడదెబ్బతో మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బతో ఎవరైనా మృతి చెందితే నిరుడు రూ. 50వేలు ఎక్స్‌గ్రేషియా అందించగా, ఆ మొత్తాన్ని రూ.4లక్షలకు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.
వడదెబ్బతో నలుగురు మృతి
నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 15 : వడదెబ్బతో మంగళవా రం రాష్ట్రంలో నలుగురు మరణించా రు. మహబూబాబాద్ జిల్లాలోని గార్ల పంచాయతీ పరిధిలోని జీవంచిపల్లికి చెందిన సుశీల (62), కొత్తగూడ మండలం వేలుబెల్లిలో బాసాని మ ల్లమ్మ(65) మరణించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో వడ్లూరి మల్లయ్య (59), కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం రాఘపూర్కు చెందిన సోయం హన్మంతు (27) మృతిచెందారు.