యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భరోసా
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మాజీ డీఎస్పీ నళినికి సంబంధించి సర్వీస్ సమస్యలు ఏమి ఉన్నా నిబంధనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిషరిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం ఆయన భువనగిరిలోని నళిని ఇంటికి వెళ్లారు. ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అల్లోపతి మందులు పడకపోవడంతో ఆయుర్వేద మందులను వాడటం వల్ల ఉపశమనం ఉన్నదని ఆమె కలెక్టర్కు తెలిపారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. నళినికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.