రైతుల సంక్షేమం పట్టని సర్కార్.. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
రైతు సంక్షేమాన్ని రాష్ట్ర సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చింతకుంటలో వరి కొనుగోలు కేంద్రాన్ని సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు.
పాన్‌గల్, మే 28 : రైతు సంక్షేమాన్ని రాష్ట్ర సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చింతకుంటలో వరి కొనుగోలు కేంద్రాన్ని సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నదని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ పాలకులు మాత్రం అష్టకష్టాలు పెడ్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనడంలో సర్కార్ జా ప్యంతో ప్రస్తుత వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టంగా పోయారని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, రైతులకు మేలు చేస్తామని భరోసా కల్పించారు. అనంతరం రైతుల దుస్థితిని ఫోన్లో జిల్లా కలెక్టర్‌కు బీరం వివరించారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

