పీహెచ్సీల్లో పనిచేస్తున్న 291 మంది డాక్టర్ల బదిలీ
అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకం
బలోపేతం కానున్న టీచింగ్ దవాఖానలు
పేదల చెంతకు మరిన్ని స్పెషాలిటీ సేవలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 : ప్రభుత్వ దవాఖానల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న నిపుణులైన వైద్యులను టీచింగ్, జిల్లా, ఏరియా దవాఖానలకు శాశ్వతంగా బదిలీ (అబ్జార్ప్షన్) చేయాలని నిర్ణయించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలోని 291 మంది వైద్యులను తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలోకి బదిలీ చేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించింది.