హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి (నాన్ క్యాడర్) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితోపాటు ఒక అదనపు సూపరింటెండెంట్ (నాన్ క్యాడర్) స్థాయి పోలీసు అధికారిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అదనపు ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న ఎస్వీఎన్ శివరామ్‌ను ఏసీబీలో అదనపు ఎస్పీగా సూపర్ న్యూమరరీ వెకెన్సీలో నియమించింది.