హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలకు ప్రభుత్వం రూ.387.51కోట్ల నిధులను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉపకారవేతనాలకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.516.68కోట్లను ప్రతిపాదించగా, ప్రస్తుతం రూ.387.51కోట్లను మంజూరు చేసింది. మహాత్మా జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకానికి రూ.23.60కోట్లు ప్రతిపాదించగా, రూ.15కోట్లను మంజూరు చేసింది.