హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మెడికోలకు 15%స్టైపెండ్ పెంచుతూ జీవో జారీచేసిన ప్రభుత్వం ఆ ఉత్తర్వులు ప్రైవేట్ మెడికోలకు కూడా వర్తింపజేయడాన్ని విస్మరించింది. దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు మెడికోల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. తెలంగాణలో 34 ప్రభుత్వ, 25 వరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని హౌజ్ సర్జన్లుగా 4,000 మందికి పైగా మెడికోలు తమ కాలేజీ అనుబంధ దవాఖానల్లోనే వైద్యసేవలందిస్తున్నా రు. ఏడాదిపాటు కొనసాగే ఇంటర్న్‌షిప్‌లో యాజమాన్యమే వారికి ప్రతినెల ైైస్టెపెండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2003లో జారీచేసిన జీవో ప్రకారం ప్రతినెల రూ.2,000 ైైస్టెపెండ్ ఇస్తుండేవారు. కేసీఆర్ ప్రభుత్వం 2023లో ప్రతినెల మెడికోలకు రూ.25,609 ఇవ్వాలని అదేశాలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలన్నీ ఈ జీవోను అమలు చేయాలని స్పష్టంచేసింది. కానీ ప్రైవేట్ కాలేజీలు మాత్రం 2003 జీవో ప్రకారమే ైస్టెపెండ్ ఇవ్వడం కొనసాగించాయి. ఇటీవల ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని మెడికోలు తమకు ైైస్టెపెండ్ సరిపోవడం లేదని చెప్పడంతో మెడికోలకు 15% ైైస్టెపెండ్ను పెంచుతూ జీవో 90 విడుదల చేసింది. ఈ జీవో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు కూడా వర్తిస్తుందని పేర్కొనకపోవడంతో గందరగోళం నెలకొన్నది. సమస్యలు పరిష్కరించి, జీవో 90ని తమకు కూడా అమలు చేయాలని పలువురు ప్రైవేట్ మెడికోలు ప్రభుత్వాధికారులను కోరారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 15% ైైస్టెపెండ్ పెంపుపై యాజమాన్యాల అభిప్రాయాలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పినట్టు సమాచారం.