ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలి
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని బేవరేజెస్ నాయకులు డిమాండ్ చేశారు.
- రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కార్మికుల డిమాండ్
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని బేవరేజెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు. ముఖ్యంగా బేవరేజెస్ కార్పొరేషన్లో 230 మంది ఉండాల్సిన చోట 120 మందితోనే ఎలాంటి ఆటంకం లేకుండా ఉత్పత్తికి కష్టపడుతున్నామని, తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. చర్చల్లో వచ్చిన సమస్యలను జాబితా రూపంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్కు విన్నవించాలని నిర్ణయించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు కలిసికట్టుగా ముందుకుసాగాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గంగా, ధీరజ్, లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ యాకుబ్, కోశాధికారి శివకుమార్, కో ఆర్డినేటర్ ఆనందకుమార్, విఠల్, ఝాన్సీ, బాలచందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

