హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)కు అప్పగించింది. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు. పోర్టల్ ప్రారంభం నుంచి టెర్రాసిస్ కంపెనీ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నది. మొదట ప్రభుత్వం మూడేండ్ల ఒప్పందం కుదుర్చుకోగా, ఆ తర్వాత మరో రెం డేండ్లు, తాజాగా నవంబర్ 30 వర కు గడువు పొడిగించింది. డిసెంబర్ ఒకటి నుంచి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పోర్టల్ నిర్వహణను విదేశీ సంస్థ నుంచి స్వదేశీ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు.
టీవీవీపీ.. ఇక సెకండరీ హైల్త్ కేర్ డైరెక్టరేట్!
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)ను సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా(ఎస్హెచ్డీ) మార్చడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టిసారించారు. ఈ మేరకు అసీ గతంలో రూపొందించిన ప్రతిపాదనలపై మంగళవారం హై దరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ టీవీవీపీ పరిధిలోని జిల్లా, ఏరియా దవాఖానాలకు ఎకు వ మంది రోగులు వస్తున్నందున అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. హన్మకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీపైనా మంత్రి సమీక్షించారు.
చెన్నమనేని పౌరసత్వంపై తీర్పు వాయిదా
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేంద్రం 2017లో రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. రమేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘ విచారణ అనంత రం మంగళవారం తీర్పు వాయిదా వేశారు.