వనపర్తి టౌన్, మే 3 : తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు.
మంత్రి ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి మైనార్టీ సంక్షేమానికి పాటుపడుతున్నట్లు చెప్పారు. పండుగలను కలిసిమెలిసి జరుపుకొనే సంస్కృతి మన రాష్ట్రంలో ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.