హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం కొత్తగా హైయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. దీనిని అసెంబ్లీలో పెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 10 ప్రైవేట్, 4 డీమ్డ్ వర్సిటీలున్నాయి. ఎప్సెట్ కౌన్సెలింగ్కు ముందే ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో సీట్లు నిండిపోతుండటంతో ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నది. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల మంజూరుపై ఉన్నత విద్యామండలి, సర్కారు పలుమార్లు యూజీసీకి లేఖలు రాశాయి. తమను సంప్రదించిన తర్వాతే కొత్తగా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలను మంజూరు చేయాలని యూజీసీకి రాసిన లేఖల్లో పేర్కొన్నాయి. తాజాగా ప్రభుత్వం బిల్లును తీసుకొస్తున్నది.