హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): నీరాకేఫ్‌ను కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ.. గౌడ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కల్లుగీత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం గౌడన్నలకు సేఫ్టీకిట్లు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. నీరాకేఫ్‌ను రాజకీయం చేయొద్దని కోరా రు. టీపీసీసీ గౌడ సెల్ వైస్ చైర్మన్ రేవతిగౌడ్, శంభుల శ్రీకాంత్, ఆనంద్‌గౌడ్, సతీశ్‌గౌడ్, పల్లె రామచంద్రగౌడ్, కొండ నలిని గౌడ్, లక్ష్మణ్ గౌడ్, కుమార్ భాసర్ గౌడ్, శివకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దుర్గేష్ గౌడ్ పాల్గొన్నారు.