హైదరాబాద్ : రాష్ట్రప్రభుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్ని వర్గాలు రోడ్ల పైకి వస్తున్నాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ (Deviprasad) పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు నుంచి సమ్మె ( RTC Strike ) ప్రారంభిస్తే వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్( KCR ) హయంలో ఆగస్టు 2023 లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని, నాడు ఎన్నికల కోడ్ రావడంతో నిర్ణయం అపాయింటెడ్ డే రాలేదని తెలిపారు. మొత్తం 32 డిమాండ్ల పై ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటిస్ ఇస్తే ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలువలేదని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులకు నైపుణ్యం లేని డ్రైవర్లను తాత్కాలికంగా నియమించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిన్న తాత్కాలిక డ్రైవర్ నిర్వాహకంతో 38 మంది ప్రయాణికులు గాయ పడ్డారని వివరించారు. తాండూరు లో పోలీసులు జారీ చేసిన హెచ్చరిక దుర్మార్గంగా ఉందని , సీఎం జిల్లాలో పోలీసులు ఎమెర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నారని వెల్లడించారు. సమ్మె పై బీజేపీ గోడ మీద పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.
ఆర్టీసీ సమ్మె వెనక హరీష్ రావు ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ఆర్టీసీ కార్మికులకే కాదు. సమస్యల్లో ఉన్న వారి ఎవరికైనా మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ అమలు చేసింది కేసీఆర్ మాత్రమేనని వెల్లడించారు. కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదిక పై హై కోర్టు తీర్పు తో ప్రభుత్వానికి కను విప్పు కావాలని సూచించారు.
ఘోష్ కమిషన్ రిపోర్ట్ నేపధ్యంలో ఇరిగేషన్ ఇంజినీర్ల పై క్రమశిక్షణ చర్యలకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.