Samagra Survey | హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నిరుడు నవంబర్‌లో నిర్వహించిన స మగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లకు సర్కారు మొండిచేయి చూపించింది. సర్వే పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తానన్న పారితోషికాన్ని ఇవ్వలేదు. ప్రతి ఇంటికీ కాళ్లరిగేలా తిరిగి సమగ్ర సమాచారాన్ని సేకరించినా ప్రభుత్వానికి కనికరం లేకపోయిందని సిబ్బంది ఆవేదన చెం దుతున్నారు. పైపెచ్చు హాజరు సర్టిఫికెట్ల కో సం ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నది.
రాష్ట్రంలో 1.17 కోట్ల కుటుంబాల వివరాల సేకరణకు దాదాపు 80 వేల మంది సిబ్బందిని వినియోగించారు. వీరిలో 36,549 మంది ఎస్టీటీలు, 3,414 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారికి ఆకర్షణీయమైన పారితోషికాన్ని ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలు ఆనాడే కోరాయి. ఈ మేరకు రూ.10 వేల చొప్పున పారితోషికం ఇస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చింది.
సర్వే పూర్తయిన వెంట నే పారితోషికాన్ని ఇవ్వాలని సంఘాల వినతి ని, ప్రభుత్వ వర్గాలు సరేనని ఒప్పుకున్నా యి. అయినా ఇంతరకు రెమ్యునరేషన్ మొ త్తాన్ని ఎన్యుమరేటర్లకు ఇవ్వనేలేదు. ఇటీవలే మంత్రులు, అధికారులను కలిసి రెమ్యునరేషన్ అందజేయాలని కోరినా ఫలితం లేకుం డా పోయిందని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.
సర్వే సందర్భంగా సిబ్బంది సెలవు రోజుల్లో నూ విధులు నిర్వహించారు. ఐదు రోజులపా టు విధులు నిర్వహించారు. ఈ సెలవు రోజు ల్లో అటెండెన్స్ సర్టిఫికెట్ ఇస్తే పరిహార సాధారణ సెలవులు (సీసీఎల్) పొందేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అటెండెన్స్ సర్టిఫికెట్ కోసం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్నారు. తమకు పైనుంచి ఆదేశాలు లేవని, ఇవ్వలేమని ఎంపీడీవోలు, పంచాయితీరాజ్‌శాఖ సిబ్బంది కరాఖండిగా చెప్పేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో హాజరు ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండగా, మరికొన్ని చోట్ల ఇవ్వడమే లేదు.
కులగణన సర్వే నిర్వహించిన సిబ్బందికి హాజరు ధ్రువీకరణపత్రం ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే అధికారులకు ఆదేశాలివ్వాలి. హాజరు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోతే సిబ్బంది 5 రోజులు నష్టపోయే అవకాశం ఉన్నది.
– మ్యాన పవన్‌కుమార్, టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు