జగిత్యాల : వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీనియర్ సిటిజన్స్, పెన్షనర్లకు ప్రభుత్వం భరోసా కల్పించే కార్యక్రమాలు చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ల జిల్లా ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవ తో రూ. కోటి నిధులతో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నామన్నారు.
అసోసియోషన్స్ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం, నిధులు మంజూరు చేయాలని అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కోరారు. థరూర్ క్యాంపు లో ఖాళీగా ఉన్న ఎస్సారెస్పీ భవనాన్ని కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. ఉద్యోగులకు,పెన్షనర్స్, జర్నలిస్టుల కు నగదు రహిత వైద్యసేవల కోసం జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా హామీ ఇచ్చినందుకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,సీనియర్ సిటీజన్స్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టివిశ్వనాథం, పెన్షనర్స్ సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి, కోశాధికారి వెలముల ప్రకాశ్ రావు, ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.