ఎలిగేడు, ఆగస్టు 30: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండు గ. ఆ పండుగ రోజు తన అన్నకు రాఖీ కట్టి పేగుబంధాన్ని పంచుకోవాలనుకున్న ఓ చెల్లె లు సంతోషంగా పుట్టింటికి వచ్చింది. ఇంటికొచ్చిన చెల్లెలిని ఆప్యాయంగా పలుకరించి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్న అన్న.. కొద్దిసేపటి తర్వాత ఛాతీలో నొప్పి వస్తున్నదని ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు తేరుకునేలోపే విగతజీవిగా మారా డు. కండ్ల ముందే అన్న మరణించాడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక.. ఆ చెల్లెలు గుండెలవిసేలా రోదిస్తున్నది. రాఖీ పండుగ రోజు సంతోషం నిండాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషా దం అలుముకున్నది. ఈ ఘటన మంగళవా రం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టలో చోటుచేసుకున్నది. ధూళికట్టకు చెంది న చౌదరి కనుకయ్య(50)కి రాఖీ కట్టేందుకు అదే గ్రామానికి చెందిన చెల్లెలు గౌరమ్మ మంగళవారం అన్న ఇంటికి వచ్చింది. కనుకయ్య చెల్లితో ఆప్యాయంగా మాట్లాడాడు. ఉన్నట్టుండి ఛాతీలో నొప్పివస్తున్నదని కుప్పకూలి ప్రాణాలు వదలడంతో నిశ్చేష్టులయ్యా రు. అన్న హఠాన్మరణంతో ఆ చెల్లెలు కన్నీటి పర్యంతమైంది. ‘అన్నా.. నీకు రాఖీ కట్టేందుకు నిన్ననే వచ్చిన. నాతోటి మంచిగా మా ట్లాడితివి. అందరూ మంచిగున్నారా? చెల్లె అని అడిగితివి. అంతలోనే ఏమైందే అన్నా.. మమ్మల్ని విడిచి ఎక్కడికెళ్తున్నవే. నేనేం పా పం జేసిననే. ఒక్కసారి లేచిరావా?.. నీకు రాఖీ కడుతా అన్నా’ అంటూ సోదరుడి మృ తదేహంపై పడి గుండెను బాదుకుంటూ విలపించింది. అంత్యక్రియల ముందు అన్న మృ తదేహానికి రాఖీ కడుతూ ‘ఇదే.. నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ. వచ్చే ఏడాది నుంచి రాఖీ కట్టేందుకు నా అన్న ఉండడు’ అంటూ రోదించిన తీరు.. అక్కడున్న గ్రామస్థులందరికీ కన్నీళ్లుపెట్టించింది.