ఐనవోలు, నవంబర్ 15: గౌడ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలువాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హనుమకొండ జిల్లా ఐనవోలులో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్‌లో 103 సొసైటీ కల్లు దుకాణాలు మూసివేశాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తిరిగి తెరిపించిందని తెలిపారు. గౌడ కులస్థులు ఏటా రకం రూపంలో సుమారు రూ.20గౌడ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలువాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హనుమకొండ జిల్లా ఐనవోలులో మీడియాతో మాట్లాడారు. కోట్లు చెల్లించేవారని, వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. తాటి, ఈత చెట్లు తక్కువగా ఉన్నాయని, బీహార్ నుంచి ప్రత్యేకమైన విత్తనాలు తెప్పించి పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ నడిబొడ్డున నీరా కేఫ్ పెట్టి, నీరాకు, గౌడ కులస్థుల గౌరవాన్ని పెంచిందని సూచించారు. కల్లు అంటే చిన్న చూపు ఉండేదని, నీరా వల్ల 16 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రచారం చేయడం గౌడ కులస్థుల ఉన్నత స్థానాన్ని పెంచిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నకు తగిన గుర్తింపును ఇచ్చిందని తెలిపారు. పాపన్న విగ్రహ ఏర్పాటుకు ట్యాంక్‌బాండ్‌పై స్థలం కేటాయించిందని, గౌడ కులస్థులకు కోకాపేటలో ఐదు ఎకరాల భూమి కేటాయించిందని, దాని విలువ ప్రస్తుతం రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని పేర్కొన్నారు. గౌడ కులస్థులు, బీసీలు బీఆర్ఎస్కు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌ను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.