కులవృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్కు మద్దతు
కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గౌడ సంఘం సంపూర్ణ మద్దతునిస్తున్నదని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ తెలిపారు. మంగళవారం అల్వాల్ లోతుకుంటలో గౌడ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
- గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్
మల్కాజిగిరి/అల్వాల్, నవంబర్ 21: కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గౌడ సంఘం సంపూర్ణ మద్దతునిస్తున్నదని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ తెలిపారు. మంగళవారం అల్వాల్ లోతుకుంటలో గౌడ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టూ ఉన్న 270 సోసైటీలు 103 కల్లు దుకాణాలను గత 2006లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూసివేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ నిర్ణయంతో నాడు లక్షమంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మొదటి మంత్రివర్గ సమావేశంలో కల్లు, గీత కార్మికుల సంక్షేమం కోసం కల్లు దుకాణాలను తెరువాలని నిర్ణయించారని చెప్పారు. ఏటా రూ.20 కోట్లు కిరాయిని సైతం మాఫీ చేశారని కొనియాడారు. సర్దార్ పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్తి మద్దతు తెలుపుతున్నామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ మెంబర్ జ్యోతిగౌడ్, గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్, నేమూరి శ్రీధర్‌గౌడ్, మల్లేశ్‌గౌడ్, శోభగౌడ్, రాజేశ్కన్న, నక్క రాజేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

