గంభీరావుపేట, మే 1: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరంటాల(Gorantala) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిని శుక్రవారం సర్పంచ్ ఎర్రం లతిక, హెచ్ ఎమ్ మనోహర్ రెడ్డి అభినందించారు. పాఠశాల టాపర్గా మధు హాసిని 560 మార్కులు సాధించగా మొత్తం 13 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. 2022 లో అప్పటి మంత్రి కేటీఆర్(KTR) సహకారంతో ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం చేసి నూతనంగా ఉన్నత విద్యను ప్రారంభించారు.
‘గీవ్ తెలంగాణ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో 6 అదనపు తరగతి గదులను నిర్మాణం చేశారు. దీంతో పాఠశాల మొదటి పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు విడుదల చేసిన ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. కేటీఆర్ చొరవతో అప్పటి జడ్పీటీసీ విజయ, సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీ అంజిరెడ్డి తో పాటు గ్రామస్తుల కృషితో మంజూరు చేసుకున్న గోరంటాల ఉన్నత పాఠశాల నేడు మొదటి బ్యాచ్ పదో తరగతి ఫలితాలలో ఆదర్శంగా నిలిచింది.