గురువారం 28 మే 2020
Telangana - May 19, 2020 , 01:48:08

గుర్తుకొస్తున్నాయి..

గుర్తుకొస్తున్నాయి..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఐదేండ్ల క్రితం తాను అమెరికాలోని సియాటిల్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలను ఐటీ మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ‘ఐదేండ్ల క్రితం ఇదే రోజున నేను సియాటిల్‌లో ఉన్న విషయాన్ని గూగుల్‌ ఫొటోస్‌ నాకు గుర్తుచేసింది’ అంటూ ఆ ఫొటోలతోపాటు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చేనేత మాస్క్‌ ధరించిన ఫొటోను కూడా పోస్ట్‌చేశారు.

ఐవీఎఫ్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిర్వహించిన సామాజిక కార్యక్రమాలపై ఉప్పల ఫౌండేషన్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ (ఐవీఎఫ్‌)కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. లాక్‌డౌన్‌ సమయంలో చేపట్టిన సామాజిక కార్యక్రమాలను ఆయన మంత్రికి వివరించారు. 


logo