హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు ఆయిల్‌ఫెడ్ ద్వారానే సరుకులు పంపిణీ చేస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ‘అంగన్వాడీ కేంద్రాలకు ఆయిల్ ఫెడ్ సరుకులు బంద్’ పేరుతో సోమవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. సరుకులు నాణ్యంగా రావడంలేదన్న ఫిర్యాదులు వ చ్చిన మాట నిజమేనని శాఖ డైరెక్టర్ కాంతివెస్లీ తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేయాలని టీచర్లు, వర్కర్ల యూనియన్ నుంచి ఇటీవల వినతులు అందాయని చెప్పారు. ఈ విషయాన్ని తాము టీజీ ఆయిల్‌ఫెడ్ దృష్టికి తీసుకెళ్లగా తగిన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సరుకుల పంపిణీ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించలేదని స్పష్టం చేశారు. పంపిణీ చేయలేమని ఆయిల్‌ఫెడ్ ఎండీ నుంచి సైతం ఎలాంటి వినతి రాలేదని చెప్పారు.